మహిళను తాళ్లతో కట్టి నిప్పుటించాడు | Woman killed by Unidentified assaults at Kurnool district | Sakshi
Sakshi News home page

మహిళను తాళ్లతో కట్టి నిప్పుటించాడు

Feb 4 2015 10:20 AM | Updated on Sep 2 2017 8:47 PM

కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెలో బుధవారం ఓ దారుణం వెలుగుచూసింది.

(కర్నూలు)కొలిమిగుండ్ల: డబ్బులివ్వనందుకు వెంకటిబాయి అనే మహిళను మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడో ఘనుడు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లె ఎస్టీ తండాలో జరిగింది. అదే గ్రామానికి చెందిన శ్రీను నాయక్, వెంకటి బాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. మంగవారం రాత్రి తన అవసరాల కోసం డబ్బులు ఇవ్వనందుకు శ్రీను నాయక్, వెంకటిబాయిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

స్థానికులు కొన ఊపిరితో ఉన్న వెంకటిబాయిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. చనిపోయే ముందు ఆమె మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement