విషాదం: ప్రాణం తీసిన చేపల కూర.. భార్య మృతి.. కోమాలో భర్త!

Woman Dies Husband In Coma After Eating Deadly Fish In Malaysia - Sakshi

విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతిచెందింది. ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మార్చి 25న మలేషియాలో వెలుగుచూసింది. జపాన్‌లో ఎక్కువగా తినే పఫర్ ఫిష్‌ రుచికరంగా ఉండటంతోపాటు అత్యంత విషపూరితమైనది. ఇది తెలియక జోహోర్‌కు చెందిన ఓ వ్యక్తి  స్థానిక మార్కెట్‌ నుంచి పఫర్‌ ఫిష్‌ను కొనుగోలు చేశాడు. వాటిరి ఇంటికి తీసుకురాగా అతని భార్య లిమ్‌ సీవ్‌ గ్వాన్‌ (83) చేపలను శుభ్రం చేసి కూర చేసింది.

ఇద్దరు కలిసి తిన్న తర్వాత తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గ్వాన్‌కు ఒంట్లో వణుకు పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఇవే లక్షణాలు కొంత సమయానికి అతనిలో కూడా ప్రారంభమయ్యాయి. గమనించిన కుమారుడు తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే అదే రోజు సాయంత్రం తల్లి లిమ్‌ సీవ్‌ గ్వాన్‌ మరణించింది. పఫర్ ఫిష్ తినడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కోమాలో ఉన్న తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 

అయితే తన తండ్రి చాలా ఏళ్లుగా చేపల మార్కెట్‌లోని ఆ షాపు నుంచి ఇలాంటి చేపలను చాలాసార్లు కొన్నారని, ఇలా ఎప్పుడూ జరుగలేదని కుమార్తె తెలిపింది. రుచికరమైన ఈ చేపను కొని తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యక్తి తన తండ్రి కాదని అతడు వాపోయింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందిస్తూ.. దంపతులు తిన్న చేపల వివరాలు సేకరించినట్లు తెలిపారు.

కాగా పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే ప్రాణాంతక విషపూరితాలు ఉంటాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫ్రీజ్‌ చేయడం లేదా వండటం వల్ల చేపలోని ఆ విష పదార్థాలు నాశనం కావని పేర్కొంది. పఫర్‌ చేపల నుంచి ఈ విష పదార్థాలను ఎలా తొలగించి.. వండాలనే దానిపై శిక్షణ పొంది అత్యంత నిపుణత కలిగిన చెఫ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది.
చదవండి: హిజాబ్‌ ధరించలేదని యువతులపై పెరుగుతో దాడి.. వీడియో వైరల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top