రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం | Woman Gang Rape in Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం

Jun 19 2014 7:13 PM | Updated on Sep 2 2017 9:04 AM

రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం

రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని లాలాచెరువు సమీపంలో గురువారం దారుణం జరిగింది.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని లాలాచెరువు సమీపంలో గురువారం దారుణం జరిగింది. పని కోసం రాజమండ్రి వచ్చిన ఓ యువతిని పలువురు యువకులు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని స్థానికులకు వెల్లడించింది.

 

స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ యువతిని పోలీసులు స్టేషన్కు తరలించారు. నిందితుల వివరాలు సేకరించి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement