కారు బోల్తా: మహిళ మృతి | Woman dead and three injured as Car overturns | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: మహిళ మృతి

Dec 22 2015 5:45 PM | Updated on Sep 3 2017 2:24 PM

వైఎస్సార్ జిల్లా పులివెందులలోని నామాలగుండు వద్ద ఓ కారు బోల్తా పడి జయకళ(38) అనే ఉపాధ్యాయురాలు మృతిచెందారు.

పులివెందుల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా పులివెందులలోని నామాలగుండు వద్ద ఓ కారు బోల్తా పడి జయకళ(38) అనే ఉపాధ్యాయురాలు మృతిచెందారు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. గొల్లపల్లి తాండాలో పనిచేస్తున్న ఆమె అటుగా వస్తున్న కారులో లిఫ్ట్ అడిగి ఎక్కారు. అయితే పులివెందుల శివారులో కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement