విశాఖలో చిత్ర పరిశ్రమకు వెంటనే క్లియరెన్సులు | will give single window clearnces on film industry in Vizag | Sakshi
Sakshi News home page

విశాఖలో చిత్ర పరిశ్రమకు వెంటనే క్లియరెన్సులు

Nov 27 2014 3:59 AM | Updated on Aug 11 2018 8:27 PM

విశాఖలో చిత్రపరిశ్రమ ఏర్పాటుకు సింగిల్‌విండో క్లియరెన్సులు ఇస్తామని ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు చెప్పారు.

మంత్రులు అయ్యన్న, గంటా వెల్లడి
 విశాఖపట్నం: విశాఖలో చిత్రపరిశ్రమ ఏర్పాటుకు సింగిల్‌విండో క్లియరెన్సులు ఇస్తామని ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు చెప్పారు. ‘మేముసైతం’ కార్యక్రమ నిర్వహణలో భాగం గా బుధవారం విశాఖలోని రామానాయుడు స్టూడియోలో వారు మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖ పునర్నిర్మాణానికి సినీ తారలంతా మేము సైతం అంటూ ముందుకురావడం అభినందనీయమన్నారు.
 
 ఈనెల 30న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మేము సైతం కార్యక్రమంలో పలు వినోద కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. రాష్ట్రంలో గతంలో కూడా విపత్తుల సమయంలో చిత్రపరిశ్రమ ఆదుకుందని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.  తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖను ఆదుకునేందుకు చిత్రపరిశ్రమ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని హీరో వెంకటేశ్‌తెలిపారు. సమావేశంలో హీరోయిన్ శ్రీయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement