భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్ష | Wife Protest in Front Of Husband House In Kurnool | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్ష

Sep 17 2019 8:49 AM | Updated on Sep 17 2019 8:50 AM

Wife Protest in Front Of Husband House In Kurnool - Sakshi

భర్త ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న ఉమాదేవి  

సాక్షి, కర్నూలు : న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్షకు దిగిన ఘటన మండల పరిధిలోని ఉల్చాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధితురాలు ఉమాదేవి మాట్లాడుతూ ఉల్చాల గ్రామానికి చెందిన బోయ రాజ్‌కుమార్‌ తనను గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నాడన్నారు. కర్నూలు బళ్లారి చౌరస్తాలో కాపురం పెట్టి, కొద్ది రోజులు మోజు తీర్చుకొని, తనకు చెప్పకుండా ఉల్చాల గ్రామానికి వెళ్లాడన్నారు. ఇప్పుడు తక్కువ కులందానికి కావడంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ తనను మోసం చేసేందుకు యత్నిస్తున్నాడని, పోలీసులు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉమాదేవికి సర్ధిచెప్పి దీక్ష విరమింపజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement