కుమార్తెకు ఫోన్‌ చేసిన కాసేపటికే విషాదం | Karnataka devotee commits suicide in Kurnool | Sakshi
Sakshi News home page

కుమార్తెకు ఫోన్‌ చేసిన కాసేపటికే విషాదం

Oct 12 2026 1:32 PM | Updated on Oct 12 2026 1:56 PM

Karnataka devotee commits suicide in Kurnool

మృతి చెందిన జయశీల (ఫైల్‌)

కర్నూలు: మంత్రాలయం క్షేత్రంలో ఓ కర్ణాటక భక్తురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక రాష్ట్రం చామారాజానగర్‌ జిల్లా మల్‌వల్లి గ్రామానికి చెందిన జయశీల (40), ఆమె అన్న, వదినతో కలసి బుధవారం మంత్రాలయం చేరుకున్నారు. స్వామిని దర్శించుకున్న తర్వాత మఠం గదిలో వసతి పొందారు. తన ఆరోగ్యం సరిగా బాగా లేనందున సేవ చేసేందుకు కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని ఇంటి వద్ద ఉన్న భర్త మహేశప్ప, కుమార్తె లావణ్యకు తెలిపింది. 

అదే రోజు ఆమె అన్న తిరిగివెళ్లగా, ఆమెకు తోడుగా ఉన్న వదిన శుక్రవారం వెళ్లిపోయింది. కాగా రెండు రోజులు క్షేత్రంలో ఒంటరిగా ఉన్న జయశీల ఆదివారం మధ్యాహ్నం కుమార్తెకు ఫోన్‌ చేసి ‘ఆరోగ్యం సహకరించడం లేదని, తాను చని పోతున్నట్లు’ ఫోన్‌ చేసి చెప్పింది. వెంటనే లావణ్య మంత్రాలయం పోలీసులకు విషయం చెప్పగా.. సాంకేతిక పరిజ్ఞానంతో నది సమీపంలో ఆంజనేయ స్వామి గుండ్లు ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అప్పటికే ఆమె నీటిలో శవమై కనిపించడంతో కుటుంబీకులు విషయం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement