భార్యకు సినీ డైరెక్టర్ హరికృష్ణ వేధింపులు | wife harassed by husband | Sakshi
Sakshi News home page

భార్యకు సినీ డైరెక్టర్ హరికృష్ణ వేధింపులు

May 30 2014 8:52 PM | Updated on Aug 29 2018 1:13 PM

సినీ దర్శకుడిగా ఉన్న తన భర్త గత కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ నిరసన చేపట్టింది.

హైదరాబాద్: సినీ దర్శకుడిగా ఉన్న తన భర్త గత కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ నిరసన చేపట్టింది. హరికృష్ణ అనే సినీ దర్శకుడు మానసికంగా వేధిస్తున్నాడంటూ అతని భార్య శ్రీలేఖ పోలీసుల్ని ఆశ్రయించింది.  ఈ ఘటనకు సంబంధించి ఆమె నెల్లూరు జిల్లా వాకాడ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. తనను ఇంటి నుంచి గెంటివేసిన అతను పాపను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఆమె.. పాపను అప్పగించాలంటూ నిరసన చేపట్టింది. దీంతో హరికృష్ణ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారైయినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement