భార్యతోనే భర్త.... | Wife and husband suicide | Sakshi
Sakshi News home page

భార్యతోనే భర్త....

Sep 15 2014 3:15 PM | Updated on Nov 6 2018 7:56 PM

భార్యతోనే భర్త.... - Sakshi

భార్యతోనే భర్త....

భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త కూడా మనఃస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

నరసరావుపేట: భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త కూడా మనఃస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గుంటూరు నాగరాజు(33)కు, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన మాధవితో పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. వారు పర్చూరులో నివాసం ఉంటుంన్నారు. నాగరాజు ఒక హోటల్లో వంట మాస్టర్గా పని చేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనఃస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దాంతో మాధవి ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

 నాగరాజు తట్టుకోలేకపోయాడు. మాధవిలేని తన బతుకు ఎందుకు? అనుకున్నాడు. మనఃస్తాపం చెందిన నాగరాజు స్థానిక ప్రకాశ్ నగర్ ఆంధ్రా బ్యాంకు సమీపంలోని రైల్వే ట్రాక్పై మధ్యాహ్నం నంద్యాల నుంచి నల్లపాడు వెళ్లే గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు.
**

Advertisement
 
Advertisement
Advertisement