'కొత్త రాజధానిపై బాబు మాట్లాడటం ప్రజా ద్రోహం' | why chandrababu naidu speaks about new capital?, asks sailaja nath | Sakshi
Sakshi News home page

'కొత్త రాజధానిపై బాబు మాట్లాడటం ప్రజా ద్రోహం'

Aug 31 2013 4:11 PM | Updated on Jul 28 2018 6:33 PM

'కొత్త రాజధానిపై బాబు మాట్లాడటం ప్రజా ద్రోహం' - Sakshi

'కొత్త రాజధానిపై బాబు మాట్లాడటం ప్రజా ద్రోహం'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టబోయే బస్సు యాత్రపై మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు

హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టబోయే బస్సు యాత్రపై మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు.  అది ఆత్మగౌరవ యాత్ర కాదు..ఆత్మద్రోహ యాత్ర అని ఆయన విమర్శించారు.  సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్రులు ఉద్యమిస్తుంటే.. కొత్త రాజధానిపై బాబు మాట్లాడటం విడ్డూరమేనన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన ఆయన ఏముఖం పెట్టుకుని సీమాంధ్రలో యాత్ర చేస్తారన్నారు.  సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి యాత్ర చేస్తే వారే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.

 

సీమాంధ్రలో ఆగస్టు 25వ తేదీ నుంచి బస్సుయాత్రను చేపడుతున్నట్లు ముందుగా చంద్రబాబు ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఓ దశలో ఎలాగైనా యాత్రను చేపట్టేద్దామని నిర్ణయించుకున్న బాబుకు సీమాంధ్ర నేతలు అసలు సంగతి చెప్పి  రెండు కళ్ల సిద్ధాంతం వికటించిందని కళ్లు తెరిపించారు. దీంతో బాబు బస్సు యాత్రకు బ్రేక్ పడింది. తొలుత ప్రకటించిన షెడ్యల్ ప్రకారం విజయనగరం జిల్లా  కొత్త వలస నియోజకవర్గం నుంచి రోడ్ షోను ఆరంభించాల్సి ఉంది. కాగా, ఆయన తాజాగా చేపట్టనున్న యాత్రపై సర్వత్రా విమర్శలు ఊపందుకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement