
షర్మిలకు ఘన స్వాగతం
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు సభ నుంచి సోమవారం రాత్రి పొదలకూరులో బసచేసేందుకు వచ్చిన షర్మిలకు మార్గమధ్యలో విరువూరు, మహ్మదాపురం, తాటిపర్తి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు,
పొదలకూరు, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు సభ నుంచి సోమవారం రాత్రి పొదలకూరులో బసచేసేందుకు వచ్చిన షర్మిలకు మార్గమధ్యలో విరువూరు, మహ్మదాపురం, తాటిపర్తి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహ్మదాపురంలో సుమారు 300 మంది మహిళలు, కార్యకర్తలు మేళతాళాలతో స్వాగతం పలి కారు. మహిళలు పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీకే రానున్న ఎన్నికల్లో మద్దతిస్తామన్నారు.
అలాగే తాటిపర్తిలో జనాలు షర్మిల బస్సును నిలిపి మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేయాలని పట్టుపట్టారు. ఎన్నికల కోడ్‌లో దృష్టిలో ఉంచుకుని ఆమె నిరాకరించారు. అంతరాత్రి వేళ గ్రామమహిళలు సైతం రోడ్డుమీదకు వచ్చి షర్మిలను చూసేందుకు ఉత్సాహం చూపారు. అక్కడి నుంచి షర్మిల పొదలకూరులోని ఉల్లాపు మస్తాన్‌రెడ్డి కల్యాణమండపం చేరుకుని బసచేశారు.
పొదలకూరులో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాద్, పొదలకూరు సర్పంచ్ నిర్మలమ్మ, మండల నాయకులు కోనం బ్రహ్మయ్య, పెదమల్లు రమణారెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, మహిళా కార్యకర్తలు షర్మిలకు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం పొదలకూరులో రోడ్‌షో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.