'జగ్గీ వాసుదేవ్‌కు భూ పందేరంపై వెనక్కితగ్గం' | we would not back on jaggi vasudev land issue, says k narayanna | Sakshi
Sakshi News home page

'జగ్గీ వాసుదేవ్‌కు భూ పందేరంపై వెనక్కితగ్గం'

May 2 2015 10:12 PM | Updated on Sep 3 2017 1:18 AM

'జగ్గీ వాసుదేవ్‌కు భూ పందేరంపై వెనక్కితగ్గం'

'జగ్గీ వాసుదేవ్‌కు భూ పందేరంపై వెనక్కితగ్గం'

ఈషా ఫౌండేషన్ అధినేత, యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ప్రభుత్వం కట్టబెట్టజూస్తున్న మూలపాడు అటవీ భూములను ఆయనకు దక్కనీయబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు.

ఇబ్రహీంపట్నం(కృష్ణా) : ఈషా ఫౌండేషన్ అధినేత, యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ప్రభుత్వం కట్టబెట్టజూస్తున్న మూలపాడు అటవీ భూములను ఆయనకు దక్కనీయబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఇందుకోసం తమ ప్రాణాలు పోయినా పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం స్థానిక సీపీఐ నాయకులతో కలసి మూలపాడు అటవీ భూములను ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వనసంరక్షణ సమితి సభ్యులు, స్థానిక కూలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడవిలో వన సంరక్షణ, అటవీ ఫలసాయంతో ఇంతకాలం జీవనం సాగిస్తున్నామని, తమ పశుసంపద కూడా అడవులపైనే ఆధారపడి ఉందని వ్యవసాయ కూలీలు గోడు వెళ్లబోసుకున్నారు.

 

వేలకోట్ల రూపాయల విలువైన ఈ అటవీ భూముల్లోకి బాబాలు, చంద్రబాబు కాదుకదా వారి జేజమ్మలు దిగొచ్చినా అడుగుపెట్టనీయబోమన్నారు. తుళ్లూరు రాజధాని ప్రాంత రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, సీఎం చంద్రబాబుకు మొట్టికాయలు వేసినప్పటికీ ఆయన తీరు మారలేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement