లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తాం.. | We will supply one lakh tons yuriya | Sakshi
Sakshi News home page

లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తాం..

Nov 30 2013 6:18 AM | Updated on Sep 2 2017 1:08 AM

రబీ సీజన్‌కుగాను జిల్లాలోని రైతులకు లక్ష టన్నుల యూరియాను సరఫరా చేస్తామని డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ అన్నారు.

లింగంపేట, న్యూస్‌లైన్ :  రబీ సీజన్‌కుగాను జిల్లాలోని రైతులకు లక్ష టన్నుల యూరియాను సరఫరా చేస్తామని డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ అన్నారు. శుక్రవారం ఆయన లింగంపేటలో *30 లక్షలతో నిర్మిస్తున్న సింగి ల్‌విండో గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  రైతులకు సకాలంలో యూరియాను అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 33 వేల టన్నుల యూ రియా నిల్వ ఉందన్నారు.  వారం రోజుల్లో యూరి యాను కొనుగోలు చేస్తే, మరో 67 వేల టన్నుల యూరియా జిల్లాకు చేరుకుంటుందన్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో లక్షా 15వేల టన్నుల మొక్క జొన్నలను కొనుగోలు చేశామన్నారు.
 చైర్మన్‌కు సన్మానం
 డీసీసీబీ చైర్మన్‌ను స్థానిక సింగిల్‌విండో చైర్మన్,డీసీసీబీ డెరైక్టర్ ఎదురుగట్ల సంపత్‌గౌడ్, స్థానిక ఎన్‌డీసీసీ బ్యాంకు మేనేజర్‌గోపాల్‌రెడ్డి  శాలువాకప్పి సన్మానించారు.
 రబీలో పంటరుణాలుగా *220కోట్లు
 నాగిరెడ్డిపేట : ఈ యేడు రబీసీజన్‌లో జిల్లాలోని సహకార సంఘాల ద్వారా రైతులకు *220కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఈ యేడు జిల్లాలోని సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 10లక్షల క్వింటాళ్ల ధాన్యం, లక్షా15వేల క్వింటాళ్ల మక్కలను సేకరించామన్నారు.

వారంరోజుల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కొనుగోలుకేంద్రాల్లో ధాన్యాన్ని తూకంవేసిన కూలీలకు రెండేళ్లుగా హమాలీడబ్బులు బకాయిపడ్డాయన్నారు. ధా న్యం సేకరణ పూర్తయిన వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలకేంద్రంలో సహకార బ్యాంకు భవన నిర్మాణానికి కృషిచేస్తానని  పేర్కొన్నారు. అనంతరం బ్యాంకుభవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement