ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి | we are promote to govt employee | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Feb 16 2014 2:18 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి - Sakshi

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తు శనివారం అంగన్‌వాడీ కార్యకర్తలు మండల కేంద్రంలోని నాగార్జునసాగర్-ై హెదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు

 ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
 
 పెద్దవూర,
 అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తు శనివారం అంగన్‌వాడీ కార్యకర్తలు మండల కేంద్రంలోని నాగార్జునసాగర్-ై హెదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి చినపాక రమేష్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మంగమ్మ, ఎల్లమ్మ, సైదమ్మ, ఈశ్వరమ్మ, నారాయణమ్మ, శారద, విజయలక్ష్మీ, వసుందర, నాగమణి, పార్వతి పాల్గొన్నారు.  
 అంగన్‌వాడీల దీక్ష భగ్నం.. హేయం
 త్రిపురారం : తమ సమస్యలు పరిష్కరించాలని శాంతి యుతంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట నాలుగు రోజు లుగా అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలను భగ్నం చేయడం హేయమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అవుతా సైదులు విమర్శించారు. దీక్షల భగ్నానికి నిరసనగా శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం *10వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీకే డివిజన్ అధ్యక్షుడు దైద శ్రీను, నాయకులు సాంబ య్య, దుర్గాసింగ్, బాల్తీ వెంకయ్య, బాలయ్య, శైలజ, హేమలత, మంగమ్మ, ధనమ్మ, పద్మ, ఫర్విన్, పుష్ప  తదితరులు పాల్గొన్నారు.
 అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
 నిడమనూరు : అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిం చాలని అంగన్‌వాడీల సంఘం మండల అధ్యక్షురాలు మణెమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిడమనూరులో శనివారం ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేశారు. వీరికి సీపీఎం నాయకులు కొండేటి శ్రీను, సీఐటీయూ నాయకుడు అవుతా సైదు లు, బీజేపీ నాయకుడు దప్పిలి కోటేశ్వరరెడ్డిలు సంఘీభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు ప్రసన్న, ప్రేమలత, నాగలక్ష్మి, రాజేశ్వరి, పద్మ, కృష్ణవేణి, హేమలత, వీరమ్మ, మనోహర పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement