వార్డు సభ్యురాలి ఆత్మహత్య | Ward member commits suicide | Sakshi
Sakshi News home page

వార్డు సభ్యురాలి ఆత్మహత్య

Mar 20 2016 11:59 AM | Updated on Nov 6 2018 7:56 PM

కర్నూలు జిల్లా మిడుతూరులో వార్డు సభ్యురాలు కృష్ణవేణి కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మిడుతూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మిడుతూరులో వార్డు సభ్యురాలు కృష్ణవేణి కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్ల గత కొంతకాలంగా మనస్థాపానికి గురవుతున్న కృష్ణవేణి జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement