గుండెపోటుతో వీఆర్వో మృతి | VRO Died With Heart Attack In West Godavari | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో వీఆర్వో మృతి

Aug 2 2019 8:27 AM | Updated on Aug 2 2019 8:28 AM

VRO Died With Heart Attack In West Godavari - Sakshi

శ్రీనివాసరావు, వీఆర్వో

సాక్షి, పశ్చిమగోదావరి : గణపవరం మండలం పిప్పర వీఆర్వో డీకే శ్రీనివాసరావు (45) గురువారం ఉదయం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఉదయం తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను ఏలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా కారులోనే గుండెపోటుకు గురై మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు పిప్పర వీఆర్వోగా పనిచేస్తూ సమీపంలోని అత్తిలిలో మకాం ఉంటున్నారు. ఆయన మృతదేహం వద్ద  తహసీల్దార్‌ బొడ్డు శ్రీనివాసరావు, ఆర్‌ఐ పోతురాజు, వీఆర్వోలు, మండల రెవె న్యూ సిబ్బంది నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement