అతనితో శారీరక సంబంధం పెట్టుకో.. బాలికకు వీఆర్వో ఒత్తిడి..! | Collector Fire On VRO 17Year Girl Incident | Sakshi
Sakshi News home page

అతనితో శారీరక సంబంధం పెట్టుకో.. బాలికకు వీఆర్వో ఒత్తిడి..!

Jun 9 2026 1:59 PM | Updated on Jun 9 2026 1:59 PM

Collector Fire On VRO 17Year Girl Incident

అనకాపల్లి జిల్లా: మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసిన మహిళా వీఆర్వోపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఎం. ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హాస్టల్‌ ఉండి చదువుకుంటోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ బాలికకు సమీపంలో ఉన్న మహిళా వీఆర్వో బొల్లం పార్వతి ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని చెప్పింది. 

అందుకు బాలిక నిరాకరించడంతో మహిళా వీఆర్వో, ఆమె అక్క సింగారపు అప్పలనర్సలు చెడు ప్రచారం చేయసాగారు. బాలికకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉన్నట్టు వదంతులు సృష్టించి ప్రచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తెలిసిన బాలిక మనస్థాపం చెందడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఈ నెల 6వ తేదీన యలమంచిలి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో వీఆర్వోపై కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement