ఇటుకలు పేర్చి.. బిడ్డ బతుకును మార్చి | vro | Sakshi
Sakshi News home page

ఇటుకలు పేర్చి.. బిడ్డ బతుకును మార్చి

Feb 24 2014 4:35 AM | Updated on Sep 2 2017 4:01 AM

ఇటుకలు పేర్చి..  బిడ్డ బతుకును మార్చి

ఇటుకలు పేర్చి.. బిడ్డ బతుకును మార్చి

మీద ఇటుక పేర్చి..మధ్యలో సిమెంట్ కూర్చి ఇంటిని నిర్మించే బేల్దారీ.. తన కుమారుడి బతుకునూ మార్చుకున్నారు. రెక్కాడితే గాని డొక్కాడదని తెలిసినా కుమారుడిని చదివించడం కోసం వెనుకాడలేదు.

ఇటుకలు పేర్చి..
 బిడ్డ బతుకును మార్చి
 
 ూర్టూరు,  ఇటుక మీద ఇటుక పేర్చి..మధ్యలో సిమెంట్ కూర్చి ఇంటిని నిర్మించే బేల్దారీ.. తన కుమారుడి బతుకునూ మార్చుకున్నారు. రెక్కాడితే గాని డొక్కాడదని తెలిసినా కుమారుడిని చదివించడం కోసం వెనుకాడలేదు.

 

ఫలితంగా తన కుటుంబం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంగా ప్రత్యేక స్థానాన్ని అధిరోహించింది. మార్టూరులోని శాంతినగర్ కాలనీకి చెందిన తన్నీరు వీరాంజనేయులు బేల్దారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. తన కుమారుడు నాగరాజును ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగంలో చూడాలనేది అతని కోరిక. నాగరాజు మేనమామ కుంచాల కోటేశ్వరరావు కూడా మేనల్లుడి చదువుకు ఆర్థిక ప్రోత్సాహం అందించారు.

 

దీంతో తన్నీరు నాగరాజు నల్గొండ జిల్లా కోదాడ సనా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ దూర విద్య ద్వారా అభ్యసించారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఒంగోలులోని వివేకానంద కోచింగ్ సెంటర్‌లో గ్రూప్-2కోచింగ్ తీసుకున్నారు. ఇంతలో వీఆర్‌ఏ   పరీక్షలో 94 మార్కులు, వీఆర్‌ఓ పరీక్షలో 96 మార్కులు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. గ్రూప్-1 సాధించటమే లక్ష్యమని నాగరాజు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement