2468మందికి మాత్రమే వీఐపీ దర్శనం | VIPs' visit marks Vaikunta Ekadasi celebrations at Tirumala | Sakshi
Sakshi News home page

2468మందికి మాత్రమే వీఐపీ దర్శనం

Jan 1 2015 8:30 AM | Updated on Sep 2 2017 7:04 PM

వైకుంఠ ఏకాదశి పర్వదినం, నూతన సంవత్సరం ఒకేసారి రావడంతో... తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు... ఇరు రాష్ట్ర రాజకీయవేత్తలు, ప్రముఖలు పోటీపడ్డారు.

తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం, నూతన సంవత్సరం ఒకేసారి రావడంతో... తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు... ఇరు రాష్ట్ర రాజకీయవేత్తలు, ప్రముఖలు పోటీపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ రోహిణి, వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, డీకే అరుణ, మహేందర్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు వెంకన్నను దర్శించుకున్నారు.  2468మందికి మాత్రమే టీటీడీ వీఐపీ దర్శనం కల్పించింది.  అనంతరం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement