సెల్ టవర్ల ఏర్పాటుపై ఆందోళన | Villagers oppose Reliance cell tower | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ల ఏర్పాటుపై ఆందోళన

Jul 29 2015 1:28 PM | Updated on Sep 3 2017 6:24 AM

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

బొబ్బిలి(విజయనగరం): విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక 14వ, 23వ వార్డుల్లో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన సెల్ టవర్లను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వారు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి పోలీసులు సెక్షన్ 30 విధించారు. ప్రజలు గుంపులుగా ఉండరాదని, ఆందోళనలు చేయరాదని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలతో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement