పారిశద్ధ్య కార్మికులకు అండగా ‘ప్రగతి భారత్ ఫౌండేషన్’

Vijayasai Reddy Distributes Essential Goods To Vizag Sanitation Workers - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖలో 7500 పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని వైఎ‍స్సార్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.15 వేల మంది వాలంటీర్లకు శానిటైజర్లు,మాస్క్‌లను తమ ట్రస్ట్ తరపున పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో విశాఖలోని పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన ‘ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌’ వారికి వెయ్యి రుపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను పంపిణీ చేశారు. (రజినీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్‌)

ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పారిశుద్య కార్మికులకు కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు అందివ్వబోతున్నట్లు వెల్లడించారు. పోలీసులకు, హోంగార్డులకు, జర్నలిస్టులకు సైతం ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు అందించనున్నామన్నారు. విశాఖలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి  ట్రస్ట్ తరపున భోజన సదుపాయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తక్కువ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్డ్రంలోని నిరుపేద కుటుంబాలని ఆదుకుంటున్నారని ప్రశంసించారు. (పీఎం కేర్స్‌కు యువీ విరాళం )

భౌతిక దూరంతో కరోనాను నియంత్రించగలం
లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం పిలుపుకి స్వచ్చంద సేవా సంస్థలు స్పందించి.. పేదలని ఆదుకోవడానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. బౌతిక దురాన్ని పాటించడం ద్వారా కరోనా నియంత్రించగలమన్నారు. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడం హర్షనీయమన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో వీరికి నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ను అభినందించారు. ప్రభుత్వం తరపున కూడా అండగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది అని ప్రశంసించారు. (కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top