
సాక్షి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ విజయనగరం పట్టణాధ్యక్షుడు, జిల్లా కేంద్రాస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.ఎస్. ప్రసాద్ టీడీపీకి గుడ్‌బై చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేతలు జిల్లాకి చేసిందేమీ లేదు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు గత ముప్పై ఐదేళ్లుగా అనేక పదవులు అనుభవించిని స్థానిక సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహిస్తూ జిల్లా ప్రజలకు ఏం చేయక పోవడం దేరదృష్టకరమన్నారు. జిల్లాలో రాజకీయంగా మరొకరికి ఎదగడానికి అవకాశాల్లేకుండా చేసి, పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. మొత్తం తన రాజకీయ జీవితంలో తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేక పోయారన్నారు.