శతాబ్ది ఉత్సవాల్లో ఉపరాష్ర్టపతి | vice president in the centenary ceremonies | Sakshi
Sakshi News home page

శతాబ్ది ఉత్సవాల్లో ఉపరాష్ర్టపతి

Dec 8 2017 4:52 PM | Updated on Oct 1 2018 6:33 PM

vice president in the centenary ceremonies - Sakshi


వైఎస్సార్‌ జిల్లా :  ప్రొద్దుటూరులోని అనిబిసెంట్‌ మున్సిపల్ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కన్నతల్లి, మాతృభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరచినవాడు మనిషి కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోది వీధి బడిలో చదివి రైల్వేష్టేషన్లో టీ అమ్మాడని, వీధిబడుల్లో చదివి ఆస్ధాయికి ఎదిగాడని, నేటి విద్యార్ధులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తాను కష్టపడే ఈస్ధాయికి ఎదిగానని తెలిపారు.

 ప్రతి ఒక్కరిలో దేశభక్తి, క్రమశిక్షణ, అంకితభావం ఉండాలన్నారు. కడప, బయ్యారంలలో  ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. త్వరలొనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పి. నారాయణ, కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, తదీతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement