
సాక్షి, వైఎస్సార్: జిల్లా మహిళా నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల పుట్టినరోజును పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మాచిరెడ్డి రవి కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ చంద్ర ఒబుల్ రెడ్డి, వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ కుటుంబం అభిమానులు పాల్గొన్నారు.