కర్ణాటకలో కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలో వేదావతి నది పొంగి ప్రవహిస్తోంది.
కర్ణాటకలో కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలో వేదావతి నది పొంగి ప్రవహిస్తోంది. వలగుండ మండలం మార్లమడికి వద్ద వేదావతి నది ఉధృతరూపం దాల్చింది. శనివారం రాత్రి నుంచి ఇక్కడ వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా నిలిచిపోయింది.