తీరు మార్చుకోని వర్ల రామయ్య | Varla Ramaiah causes for conflict in Rebbana pudi | Sakshi
Sakshi News home page

తీరు మార్చుకోని వర్ల రామయ్య

Oct 6 2014 2:51 PM | Updated on Sep 2 2017 2:26 PM

తీరు మార్చుకోని వర్ల రామయ్య

తీరు మార్చుకోని వర్ల రామయ్య

పార్టీ అధినేత హెచ్చరించినా టీడీపీ నాయకుడు వర్ల రామయ్య తీరు మారలేదు.

విజయవాడ: పార్టీ అధినేత హెచ్చరించినా టీడీపీ నాయకుడు వర్ల రామయ్య తీరు మారలేదు. అతిగా ప్రవర్తించి వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పామర్రు మండలం రెబ్బనపూడిలో ఆయన వివాదానికి కారణమయ్యారు.

జన్మభూమి కార్యక్రమంలో ఆయన చేసిన హడావుడితో వివాదం రేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
 

అంతకుముందు కనుమూరు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో హడావుడి చేయడంతో వర్ల రామయ్యకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావొద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement