ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్ బాధ్యతల స్వీకరణ

Vanimohan appointed as Secretary of the Election Commission - Sakshi

‌ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేస్తా

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి జీ.వాణీమోహన్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె జమ్మూ కశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు పరిశీలకులుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె సహకార శాఖ కమిషనర్‌గా, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో– ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రశాంత వాతావరణంలో వాటిని నిర్వహించడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top