
సాక్షి, విజయవాడ: వంగవీటి మోహనరంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురువారం విజయవాడ వైఎస్సార్‌సీపీ అర్బన్ కార్యాలయంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో వంగవీటి రంగా విగ్రహానికి మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.