కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య | Vaikunta Ekadasi Celebrations In Bhadrachalam | Sakshi
Sakshi News home page

కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

Dec 12 2015 8:39 PM | Updated on Sep 3 2017 1:53 PM

వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

భద్రాచలం: వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా పుణ్యహవచనం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితులు దివ్యప్రబంధం పఠించారు. అనంతరం స్వామి వారిని మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియం వేదిక వద్దకు తీసుకొచ్చారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ స్వామి వారికి తిరువీధి సేవను ఘనంగా నిర్వహించారు. అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాద్రి రామయ్య ఆదివారం వరహావతారంలో దర్శనమివ్వనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement