ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం యూఎస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఈ సమావేశం జరిగింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం యూఎస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఈ సమావేశం జరిగింది. భేటీలో పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు మంగళవారం డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఐఏఎస్ల శిక్షణా తరగతుల క్లాసులో ఆయన ప్రసంగించనున్నారు.