నిజామాబాద్ లో గురువారం దారుణం జరిగింది. గాయత్రినగర్ లో ఓ విద్యార్థినిపై దుండగులు దాడి చేశారు.
నిజామాబాద్ : నిజామాబాద్ లో గురువారం దారుణం జరిగింది. గాయత్రినగర్ లో ఓ విద్యార్థినిపై ఈరోజు ఉదయం ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్నరష్మిక అనే విద్యార్థిని ఇంటి ముందు ఊడుస్తుండగా... బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు దాడి చేసి బ్లేడ్ తో గొంతు కోసి అనంతరం పరారయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే విద్యార్థినిపై ఎవరు దాడి చేశారు.... ఎందుకు దాడి చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమకు ఎవరూ శత్రువులు లేరని విద్యార్థిని తాతయ్య రాజారాం తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఓ మహిళపై దుండగులు దాడి చేశారు.