హోదా కాదు..అంతకుమించిందే! | Union Minister Venkaiah comments | Sakshi
Sakshi News home page

హోదా కాదు..అంతకుమించిందే!

Sep 3 2016 3:41 AM | Updated on Mar 23 2019 9:10 PM

హోదా కాదు..అంతకుమించిందే! - Sakshi

హోదా కాదు..అంతకుమించిందే!

ప్రత్యేక హోదాను మించిన సాయం ఏపీకి అందించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు వెంకయ్యనాయుడు

కేంద్ర మంత్రి వెంకయ్య వ్యాఖ్య
 
 సాక్షి, చెన్నై: ప్రత్యేక హోదాను మించిన సాయం ఆంధ్రప్రదేశ్‌కు అందించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పీఐబీ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ప్రాంతీయ సంపాదకుల సదస్సులో శుక్రవా రం రెండోరోజు ‘తిరంగా యాత్ర’ వీడియోను ఆయన విడుదల చేశారు. దీని రూపకల్పనకు గజల్స్ శ్రీనివాస్‌తోపాటు పలువురు శ్రమించారని, వీటిని అన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు తెలుగు మీడియా సంపాదకులతో ఆయన ఇష్టాగోష్టిలో పలు అంశాలపై మాట్లాడారు. ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా అని నినదిస్తున్నారని, దాని వల్ల ప్రయోజనం ఏపాటిదో ఇది వరకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుందని చెప్పారు.

హోదా అంశాన్ని విభజన సమయంలోనే తేల్చి ఉండాల్సిం దని, కేవలం నోటి మాటతో సరిపెట్టారని యూపీఏ సర్కారుపై మండిపడ్డారు. ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నినాదాన్ని అందుకుందని వెంక య్య వ్యాఖ్యానించారు. రోడ్డుకు అడ్డంగా ఆలయాలు, మసీదులు... ఇలా ఏ నిర్మాణా లు ఉన్నా వాటిని పడగొట్టాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని పట్టించుకోదలచుకోలేదన్నారు. సమయానుగుణంగా స్పందిస్తాననన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement