క్వారీ గుంతలో గుర్తుతెలియని మృతదేహం | Unidentified dead body Found | Sakshi
Sakshi News home page

క్వారీ గుంతలో గుర్తుతెలియని మృతదేహం

May 25 2015 4:51 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామంలో ఉన్న కొండ క్వారీ గుంతలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం బయటపడింది.

గుంటూరు (ఎడ్లపాడు) : గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామంలో ఉన్న కొండ క్వారీ గుంతలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. క్వారీ కూలీలు ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసే పనిలో ఉన్నారు.  కాగా గుర్తుతెలియని ఆ యువకుడి వయసు సుమారు 14 ఏళ్లు ఉంటుంది. రెండు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement