సరైన ఉద్యోగం రాలేదనే బెంగతో.. | Unemployed young man committed suicide | Sakshi
Sakshi News home page

సరైన ఉద్యోగం రాలేదనే బెంగతో..

Apr 1 2016 3:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాలేదనే మస్తాపంతో చైతన్య(26) అనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

‘ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాను. నాకు ఈ లోకంలో జీవించే అర్హత లేదు’ అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే క్వార్టర్స్‌లో ఉండే చైతన్య (25) బీటెక్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో రూ.8వేల వేతనానికి పని చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమైన చైతన్య ప్రస్తుతం రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు.తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతున్నానన్న మనస్తాపంతో సూసైడ్‌నోటి రాసి శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement