breaking news
Chitanya
-
నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్
సాక్షి, తిరుపతి : ప్రముఖ నటుడు నాగబాబు కూమార్తె నిహారిక కొణెదల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. డిసెంబర్ 9న వివాహం జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే. పెళ్లి తేదీని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు. బుధవారం ప్రభాకరరావు దంపతులు తిరుమలకు విచ్చేసి, పెళ్లి శుభలేఖను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. (డిసెంబరులో మూడు ముళ్లు) అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారని తెలిపారు. అయితే పెళ్లి మాత్రం రాజస్థాన్‌లో జరగనుందట. ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్లో వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు ప్రకభాకర్ రావు తెలిపారు. ఇక పెళ్లి పనులు కూడా మెగా వారింట ఇప్పటికే మొదలయ్యాయి. (నిహారిక ఇంట పసుపు ఫంక్షన్) చదవండి: వైరల్: కొత్త పెళ్లి కూతురుగా నిహారిక -
సరైన ఉద్యోగం రాలేదనే బెంగతో..
‘ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాను. నాకు ఈ లోకంలో జీవించే అర్హత లేదు’ అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే క్వార్టర్స్‌లో ఉండే చైతన్య (25) బీటెక్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.8వేల వేతనానికి పని చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమైన చైతన్య ప్రస్తుతం రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు.తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతున్నానన్న మనస్తాపంతో సూసైడ్నోటి రాసి శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.