'బీసీలను బాబు కరివేపాకులా వాడుకుంటున్నారు' | Udaya Bhaskar takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బీసీలను బాబు కరివేపాకులా వాడుకుంటున్నారు'

Feb 12 2015 2:56 PM | Updated on Mar 28 2019 5:23 PM

ఏపీ సీఎం చంద్రబాబు బీసీల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి. ఉదయ్కుమార్ గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు బీసీల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి. ఉదయ్కుమార్ గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బీసీలను చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను ఎన్నికల మందు తెలంగాణ సీఎం చేస్తానని చెప్పి... ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతగా కూడా చేయలేదని విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘాన్ని టీడీపీకీ ఆర్ కృష్ణయ్య తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement