విద్యుదాఘాతానికి ఇద్దరు యువకులు బలి | Two Youngsters died due to Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి ఇద్దరు యువకులు బలి

Jun 1 2015 4:03 PM | Updated on Sep 4 2018 5:16 PM

జెండా కర్రను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

వనస్థలిపురం (హైదరాబాద్) : జెండా కర్రను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో కాశీరెడ్డి, ప్రశాంత్ రెడ్డి అనే ఇద్దరు యువకులు జెండాపైపును తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పైన ఉన్న విద్యుత్ వైర్లకు పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement