అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూమకుంట వద్ద బుధవారం మధ్యాహ్నం కారు ఢీకొని ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూమకుంట వద్ద బుధవారం మధ్యాహ్నం కారు ఢీకొని ఇద్దరు కార్మికులు మృతి చెందారు. తూమకుంట పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులు ముఖేశ్, బిలాల్ బైక్‌పై వెళుతూ డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయారు. అదే సమయంలో వచ్చిన కారు వారిని ఢీకొనగా ఇద్దరూ తీవ్ర గాయాలతో మృతి చెందారు. హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.