చెరువులో మునిగి ముగ్గురు మృతి | Two killed submerged in pond | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ముగ్గురు మృతి

Oct 14 2015 2:37 PM | Updated on Sep 17 2018 8:02 PM

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చిన్నతిప్పారెడ్డిపల్లె గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్, శివ, మరో బాలుడు కలిసి సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ నీట మునిగారు. సమీపంలోని వారు గమనించి రక్షించేలోగానే మృత్యువాతపడ్డారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement