కలకలం రేపిన జంట హత్యలు | Twin murders in chittor | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన జంట హత్యలు

Sep 29 2017 1:12 PM | Updated on Sep 29 2017 1:26 PM

 Twin murders in chittor

చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి.

కురబలకోట: చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న మామిడితోటలో శుక్రవారం ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. మృతులు తంబళ్లపల్లె మండలం ఎ‍ర్రమద్దివారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రోళ్ల జగదీశ్వర్‌ రెడ్డి(29), మదనపల్లి మండలం జంగాలపల్లికి చెందిన ప్రదీప్‌(28) గా గుర్తించారు.

వీరు సుమారు 8 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. మదనపల్లికి చెందిన పూల చలపతి, దండు రవి, సాంబ శివ, రవి అనే నలుగురి హత్య కేసులో వీరు ప్రధాన నిందితులు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement