పోలీస్‌స్టేషన్ ముట్టడి, ఉద్రిక్తత | tribes dharna at west godavari distirict | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్ ముట్టడి, ఉద్రిక్తత

Sep 18 2015 1:08 PM | Updated on Aug 21 2018 9:20 PM

తమ మీద బనాయించిన అక్రమకేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.

కొయ్యూరు: తమ మీద బనాయించిన అక్రమకేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యూరు మండలం దిప్పకాయలపాడు పంచాయతి పరిధిలోని గిరిజన గూడాలకు చెందిన గిరిజనులందరూ కలిసి శుక్రవారం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ మీద ఉన్న కేసులను కొట్టేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement