‘బాబు బుద్ది మారాలని ప్రార్థిస్తున్నా..!’

Tourism Minister Avanthi Srinivas Visits Hanuman Junction In West Godavari - Sakshi

హనుమాన్‌జంక్షన్‌ ఆలయాన్ని సందర్శించిన అవంతి

బాబు తీరు ఇప్పటికీ మారలేదన్న మంత్రి

సాక్షి, పశ్చిమగోదావరి : ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్‌ ప్రసంగం అద్భుతంగా సాగిందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రసంగం ఉందని చెప్పారు. ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండాలో, ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తామో ప్రసంగంలో ప్రస్ఫుటమైందన్నారు. నిజాయితీ, విశ్వసనీయతకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ విధాలున్నాయన్నారు. హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని, రాట్నామ్మ అమ్మవారిని మంత్రి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనతోపాటు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 

‘పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పర్యాటకంగానూ అభివృద్ది చేస్తాం. చంద్రబాబు తీరు ఇప్పటికీ మారలేదు. ఆయన బుద్ది మారాలని ప్రార్ధిస్తున్నా. గత ఐదేళ్లలో పర్యాటకం అభివృద్ది చెందలేదు. తీర ప్రాంతాన్ని, ద్వారకా తిరుమల క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తాం. ఆద్యాత్మిక పర్యాటకాన్ని కూడా అభివృద్ది చేస్తాం. ఇతర రాష్ట్రాల‌మాదిరిగా విజయవాడ, విశాఖ, తిరుపతిలో విదేశీ పర్యాటకుల కోసం వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తాం. కొల్లేరుకు విదేశీ యాత్రీకులు వచ్చేలా తగు సౌకర్యాలు కల్పిస్తాం’ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top