రుణమాఫీపై ఫిర్యాదులకు టోల్ఫ్రీ నెంబర్ | toll free number alloted for loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై ఫిర్యాదులకు టోల్ఫ్రీ నెంబర్

Dec 12 2014 6:10 PM | Updated on Jun 4 2019 5:04 PM

రుణమాఫీపై ఫిర్యాదులకు టోల్ఫ్రీ నెంబర్ - Sakshi

రుణమాఫీపై ఫిర్యాదులకు టోల్ఫ్రీ నెంబర్

రైతుల రుణమాఫీపై ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటుచేసింది. 1800 103 2066 అనే నెంబరుకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు దాఖలు చేయొచ్చని అధికారులు తెలిపారు.

రైతుల రుణమాఫీపై ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటుచేసింది. 1800 103 2066 అనే నెంబరుకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు దాఖలు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఎమ్మార్వోలు, వీఆర్వోలు, బ్యాంకర్లకు వేర్వేరుగా ఐడీలు కేటాయించారు. ఈ టోల్ఫ్రీ నెంబరుకు ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పద్ధతిపైనే రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టోల్ ఫ్రీ నెంబరుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement