జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం పర్యటించనున్నట్టు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు తెలిపారు.
బొబ్బిలి, న్యూస్‌లైన్: జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం పర్యటించనున్నట్టు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. విశాఖపట్నం నుంచి నేరుగా భోగాపురం మండలానికి ఉదయం 10 గంటలకు చేరుకుంటారని తెలిపారు. భోగాపురం మండలంలోని రావాడ వద్ద పాడైన వంతెన, కొబ్బరితోటలు, అలాగే నీట మునిగిన ఎస్సీ, బీసీ కాలనీలు పరిశీ లిస్తారని తెలిపారు. అక్కడ నుంచి పూసపాటిరేగ మండలం కొవ్వాడ గ్రామానికి వెళ్లి అక్కడ పాడైన మొక్కజొన్న పంటను పరిశీలిస్తారని తెలిపారు. అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళతారని చెప్పారు.