ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Mar 21st Kcr calls to support Janata Curfew - Sakshi

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కోరారు. ఇక, కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని శనివారం తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఇదిలాఉండగా, భారత్‌లో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. శుక్రవారం నాటికి 230గా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు.. శనివారం మధ్యాహ్నం ఆ సంఖ్య 271కి చేరింది. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top