ఈనాటి ముఖ్యాంశాలు

Today News Roundup 28th Jan Central team of Doctors Coming Fever Hospital Due To corona virus - Sakshi

కొత్త పెన్షన్లను ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫిబ్రవరి 15 కల్లా ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇక శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. ఇదిలా ఉండగా ఆర్థిక సంఘం చైర్మన్‌ నందకిశోర్‌ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులు మంగళవారం ఢిల్లీలో కలిశారు.  ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చైర్మన్‌తో చర్చించారు. మరోవైపు తనపై లైంగిక దాడి జరిగిందని నిర్భయ అత్యాచార, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ముఖేష్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశాడు.  దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. మంగళవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top