కరువు ప్రాంతాలకు తక్షణ సాయం అందించాలి | To provide immediate assistance to the drought-hit areas | Sakshi
Sakshi News home page

కరువు ప్రాంతాలకు తక్షణ సాయం అందించాలి

May 21 2016 8:27 AM | Updated on Mar 21 2019 7:27 PM

కరువు ప్రాంతాలకు తక్షణ సాయం అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కోన శశిధర్‌కి కాంగ్రెస్ నాయకులు....

అనంతపురం అర్బన్ : కరువు ప్రాంతాలకు తక్షణ సాయం అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కోన శశిధర్‌కి కాంగ్రెస్ నాయకులు విన్నవించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, ఇతర నాయకులు కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు. పీసీసీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, రాష్ట్ర నాయకులు రెండు బృందాలుగా ఏర్పడి 13 జిల్లాలోని కరువు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. ఈ క్రమంలో కరువు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించామన్నారు.

అలాగే ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయన్నారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను వినతిపత్రంలో ఉంచామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement