తిరుమల జేఈవోను తరిమిన పోలీసు కుటుంబాలు | tirumala jeo srinivasa raju faces ire of police families | Sakshi
Sakshi News home page

తిరుమల జేఈవోను తరిమిన పోలీసు కుటుంబాలు

Jan 1 2015 5:40 PM | Updated on Oct 17 2018 4:29 PM

తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు చేదు అనుభవం ఎదురైంది. వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం సందర్భంగా భద్రత కోసం వచ్చిన పోలీసు కుటుంబాలు.. ఆయనను తరుముకెళ్లాయి.

తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు చేదు అనుభవం ఎదురైంది. వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం సందర్భంగా భద్రత కోసం వచ్చిన పోలీసు కుటుంబాలు.. తమకు దర్శనం కల్పించలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. టీటీడీ ఉద్యోగులకు మాత్రం విడిగా దర్శనం కల్పించిన జేఈవో.. పోలీసులను మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

చివరకు జేఈవోను పోలీసు కుటుంబాల సభ్యులు తరుముకెళ్లారు. దాంతో జీఈవో శ్రీనివాసరాజు తిరుమల వీధుల్లో పరుగులు తీయాల్సి వచ్చింది.  24 గంటలు విధి నిర్వహణలో ఉంటున్న పోలీసులను అధికారులు పట్టించుకోలేదని వాళ్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement