గ్రామంలో పెద్దపులి సంచారం | Tiger wandering in Village | Sakshi
Sakshi News home page

గ్రామంలో పెద్దపులి సంచారం

Jul 16 2015 3:23 PM | Updated on Sep 3 2017 5:37 AM

కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ గ్రామలో పెద్దపులి సంచరిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

ఆత్మకూరు (కర్నూలు) : కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ గ్రామలో పెద్దపులి సంచరిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆత్మకూరు మండలంలోని నాగులూటిగూడెం సమీపంలో గత మూడు రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం అటవీప్రాంతంలో మేకల మందపై దాడి చేయగా గ్రామస్తులు దానిని తరిమేశారు.

అలాగే బుధవారం రాత్రి గూడెంలోని ఓ ఇంటి ఆవరణలో ప్రవేశించగా గమనించి గట్టిగా కేకలు వేయటంతో అది పారిపోయింది. దీనిపై గురువారం ఉదయం అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా రెస్క్యూటీం అక్కడికి చేరుకుంది. బోను ఏర్పాటుచేసి, పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement