మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక | Thunderbolt Warning In Three Districts | Sakshi
Sakshi News home page

మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Oct 6 2019 3:26 PM | Updated on Oct 6 2019 3:31 PM

Thunderbolt Warning In Three Districts - Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని ఏపీ రాష్ట్ర్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి, సోంపేట, మందస, పలాస..కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు..అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు, నల్లచెరువు, తలుపుల, కదిరి, గాండ్లపెంట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement